Monday, November 17, 2008

Nenu saitam

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చుపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కద గుండె బలం తెలిసేది
దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలెమిటండీ

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ||4||
గుండెల్లో సుడితిరిగే కలత కథలు
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ||3||
కోకిలల కుటుంబంలో చెడపుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని ||2||
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ||2||
పాట బాట మారాలని చెప్పడమే నా నేరం
గూడు విడిచి పొమ్మంది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచ వన్నెల విరి తోట ||2||
బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ...దేవుళ్ళ బాట ||2||
||చెప్పాలని ...||2||
ఏటి పొడుగునా వసంత మొకటేనా కాలం
ఏది మరి మిగతా కాలాలకు తాళం
నిట్టుర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి ఝడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక్యనున్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం
అని అడిగిన నా ప్రశ్నకు ఆలిగె మత్త కోకిల
కళ్లు ఉన్నా కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా
నూతి లోని కప్పలా బతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
||చెప్పాలని|| ||2||

అసహాయతలో ధడ ధడ లాడే హృదయ మృదంగ ధ్వానం
నారుల నడతల తడబడి సాగే ఆర్తుల ఆగని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కూ మొక్కూ తెలియని జీవుల యదార్థ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి, ఈ అపశ్రుతి సరి చేయాలి
జనగీతిని వద్దనుకుంటూ, నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను, కలవరింత కోరను నేను

నేను సైతం విశ్వ వీణకు తంతినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను ||2|
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతీ మనిషికి జీవితంలో నందనం వికసించు దాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
నేను సైతం నేను సైతం నేను సైతం

2 comments:

Meher :) said...

You should prolly start writing more here :)

You got lyrics here for a lot of my fave songs!

Unknown said...

Hi Aditya I liked your collection coz all of them are my fav numbers. I have few more sets of lyrics. If you want I can send them so that u can post them here.